శ్రీరాముని సేవలో శ్రీ లక్ష్మి నరసింహ కోలాటం బృందం సభ్యులు

శ్రీరాముని సేవలో శ్రీ లక్ష్మి నరసింహ కోలాటం బృందం సభ్యులు

మధురవాడ: పెన్ షాట్ ప్రతినిధి : మార్చ్ 08

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కాకినాడలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలాట నృత్యం ప్రదర్శన చేసేందుకు మధురవాడ పలు ప్రాంతాల నుండి సుమారు 28 మహిళలు బయలుదేరారు.

ఈ కార్యక్రమం మధురవాడ కి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం సభ్యులు పాల్గొంటున్నట్లు బృందం గురువు సంతోషి తెలిపారు. మహిళా దినోత్సవం నాడు ఇంత మంది కలిసి శ్రీరాముని సేవలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని బృందం సభ్యులు తమ ఆనందం వ్యక్తం చేసారు.