ఐదవ వార్డులో కార్పొరేటర్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : మార్చ్ 07:మూడు కోట్ల అరవై రెండు లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా.
ఐదవ వార్డ్ అభివృద్ధి కి సహకరిస్తున్న ఎమ్మెల్యే గంటాకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ హేమలత.
కొత్త పరదేశీపాలెం, వికలాంగుల కాలనీలో ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పాల్గొని శిలాఫలకం ఆవిష్కరణ చేసారు. అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు కోట్ల అరవైరెండు లక్షల నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2014 నుండి 2019 వరకు నేను మంత్రిగా భీమిలి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి సుమారు 80 శాతం పనులు పూర్తి చెయ్యగా 2019లో వచ్చిన వైస్సార్సీపీ ప్రభుత్వం ఐదేల్లలో ఇరవై శాతం పూర్తి చెయ్యలేక పోయారని అన్నారు. వాటిని కూడా అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యిన తరువాత అధికారులతో సమావేశం అయ్యి వాటిని పరిశీలించి పూర్తి చేసేవిధంగా చేస్తామన్నారు. అదేవిధంగా సాగర్ నగర్ సముద్రం వద్ద నూట ఎనిమిది కోట్ల నిధులతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేవిధంగా శనివారం శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ...వార్డులో మౌలిక వసతుల కల్పనకు సహకరించిన గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఈరోజు సుమారు3 కోట్ల 62 లక్షలతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, ముఖ్యంగా వాటిలో రోడ్లు, కాలువలు,మెట్ల మార్గాలు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అలాగే వార్డులో త్రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో సుమారు రెండు కోట్ల నిధులతో త్రాగునీటి పైపులైన్లు వేయడం జరిగిందని ఇంకా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,రాష్ట్ర టిడిపి నాయకులు పిల్లా వెంకట్రావు,టిడిపి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు,బోయి వెంకటరమణ, వార్డ్ టిడిపి జనసేన అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ,దేవర శివ, రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు, నమ్మి శ్రీను, మహిళ నాయకులు బోయి రమాదేవి, వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, యువత అధ్యక్షులు కొండపు రాజు, చలుమూరి శ్రీనివాసరావు (గడ్డి శ్రీను), లంక రాజేంద్రప్రసాద్, బొడ్డేపల్లి రంగారావు, కర్మోజు గోవిందరావు, వైకుంఠ రావు, దుర్గారావు, సన్యాసిరావు,కానూరి అచ్యుతరావు, వియ్యపు నాయుడు, అప్పల సూరిబాబు రెడ్డి, జనసేన నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అప్పల రెడ్డి, శివ, వెంకటరెడ్డి, నారాయణశెట్టి చక్రపాణి, నాగేశ్వరరావు, అప్పారావు, మహిళ నాయకులు హేమలత, సరస్వతి, అన్నపూర్ణ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.