వాంబేకాలనీలో ఉన్న అన్నా కాంటీన్ ను ఆకష్మిక తనికీ చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : మార్చ్ 07:
మధురవాడ, వాంబేకాలనీలో ఉన్న అన్నా కాంటీన్ ను శుక్రవారం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ రావు ఆకస్మిక తనికీ నిర్వహించారు. పలువురు నుండి పలు సార్లు భోజనం నాణ్యత బాగోటం లేదని కార్పొరేటర్ మంగమ్మ దృష్టికి స్థానిక నేతలు తీసుకు వెళ్లగా కార్పొరేటర్ మంగమ్మ అన్నా కాంటీన్ లో భోజనం విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళటంతో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. స్థానిక కూటమి నేతలతో ప్రజలతో కలిసి అన్నా కాంటీన్ లో భోజనం రుచిని చూసారు. పేదలకు కడుపునిండా ఐదు రూపాయలకే మంచి భోజనం అందించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఆశయం అని అన్నారు. వారి సూచనలతో మనం పేదలకు మూడు పూట్ల మనసారా తినేవిధంగా మంచి నాణ్యతతో కూడిన భోజనం అందచేయాలని నిర్వాహకులకు సిబ్బందికి అధికారులకు సూచనలు చేసారు. అన్నా కాంటీన్ నిర్వహణలో పేదలకు అందించే భోజనం లో నాణ్యత లోపించింది అనే విషయం పునరావృత మైతే ఉపేక్షించేది లేదని ఆయన సున్నితంగా హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి, 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత టీడీపీ సీనియర్ నాయకులు పిళ్ళా వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.