ఋషికొండ సముద్రం తీరంలో పర్యటించిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ రావు

ఋషికొండ సముద్రం తీరంలో పర్యటించిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ రావు

 మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : మార్చ్ 08

ఋషికొండ సముద్రం తీరంలో శనివారం సాయంత్రం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ రావు పర్యటించారు. ఇటీవల బ్లూ ప్లాగ్ తాత్కాలిక రద్దు చేయటంతో రద్దుకు గల కారణాలు పై పరిశీలించారు. టూరిజం అధికారులు, జీవీఎంసీ, హెల్త్ అధికారులు, పోలీస్ అధికారులతో ఈ పర్యటన చేసారు. ఋషికొండ ప్రాంతంలో ప్రతీ ప్రాంతం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాదుతూ విశాఖ సిటీ అఫ్ డెస్డినీ గా విశాఖకు గుర్తింపు ఉంది. అందులో ఋషికొండ సముద్రం తీరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో పది సముద్రాలకు బ్లూ ప్లాగ్ గుర్తింపు ఉండగా మన విశాఖలో ఋషికొండ సముద్రానికి బ్లూ ప్లాగ్ గుర్తింపు ఉంది. బ్లూ ప్లాగ్ ప్రత్యేకత విదేశీయులు కానీ ఇతర రాష్ట్రాలు పర్యాటకులు వచ్చేటప్పుడు సముద్ర తీరానికి సెర్చ్ చేసినప్పుడు బ్లూ ప్లాగ్ గుర్తింపు ఉండటంతో పర్యాటకులు వస్తారు. ఇటీవల ఋషి కోండ భీచ్ కు బ్లూ ప్లాగ్ గుర్తింపు తాత్కాలిక రద్దు చేయటంతో నేడు సందర్శనకు వచ్చాం. బ్లూ ప్లాగ్ తాత్కలిక రద్దుకు గల కారణాలను విశ్లేశించి వాటిని పునరుద్దరిస్తాము.
బ్లూ ప్లాగ్ విషయం పై అసెంబ్లీలో చర్చింటం జరిగింది. అధికారులతో సమీక్షించి మళ్ళీ బ్లూ ప్లాగ్ పునరుద్దరించే విధంగా చూస్తాము. బ్లూ ప్లాగ్ వారు పర్యటనకు వచ్చే సరికి అన్ని సిద్ధం చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ నూట డెబ్భై దుకాణాలు ఉన్నాయి. ఋషి కొండకు వచ్చె పర్యాటకులకు అన్ని రకాల మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. ఋషి కొండ విషయం పర్యాటక శాఖ మంత్రి తో మాట్లడడం జరిగింది. ప్రస్తుతం విదేశి పర్యాటనలో ఉన్నారు వచ్చిన వెంటనే ఒకసారి అదికారులతో పర్యవేక్షిస్తామన్నారు. గతంలో ఉన్న ప్రవైట్ సిబ్బంది కాంట్రాక్టు గడువు పూర్తి కావటంతో ఈ సమస్య వచ్చింది. త్వరలోనే ప్రవేట్ సిబ్బంది ఏర్పాటు చేసి వారి ద్వారా బ్లు ప్లాగ్ గుర్తింపు శాశ్వతంగా ఉండెటట్టు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.