ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలోని పేదలకు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్

ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలోని పేదలకు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ 

విశాఖపట్నం: వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 01:

పేదలకు సేవ చేయాలన్న కృతనిత్యంతో ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ కే అంకితమైన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు అని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కొనియాడారు శనివారం ద్రోణంరాజు శ్రీనివాసరావు 64వ జయంతి సందర్భంగా వన్ టౌన్ లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ లోని పేదలకు అన్నదానము మరియు వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ద్రావణం రాజు శ్రీనివాసరావు కుమారుడు శ్రీవత్స, కార్పొరేటర్ లు తోట పద్మావతి, బిఫెన్ జైన్, వైయస్సార్సీపి నాయకులు పేడాడ రమణకుమారి ఇతర వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సంక్షేమంలో పాల్గొంటూ ప్రజలకు ఎంతో సేవ చేసే వారిని, ఎమ్మెల్యేగా విఎంఆర్డిఏ చైర్మన్ గా పదవులు చేపట్టి అనతి కాలములోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వృద్ధులకు ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు.