పద్మనాభం. మండలంలోని అనంతవరం. గంధవరం. గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్. సుడిగాలి పర్యటన
పద్మనాభం: పెన్ షాట్ ప్రతినిధి : ఫిబ్రవరి 12:
పద్మనాభం. మండలంలోని అనంతవరం. గంధవరం. గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. అనంతవరం, గంధవరం గ్రామాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న రీ-సర్వే, ఈ-పంట ప్రక్రియలను పరిశీలించారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు గ్రామమైన గంధవరంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను పరిశీలించి అక్కడ అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. డ్రోన్, రోవర్ ద్వారా రీసర్వే జరిగిన తీరును సునిశితంగా పరిశీలించారు. సర్వే పూర్తి అయిన తర్వాత గ్రామసభ నిర్వహించాలని, పూర్తి వివరాలను రైతుల ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతుల వినతులను, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో స్థానిక రైతులతో కలెక్టర్ కాసేపు వివిధ అంశాలపై మాట్లాడారు. రీ-సర్వే, ఈ-పంట, ఇతర సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఆయన రీసర్వే తాలూక వివరాలను, నివేదికలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు నివేదికలను పొందుపరచాలని, వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. తర్వాత అనంతవరం గ్రామంలో పర్యటించిన ఆయన అక్కడి పొలాల్లో జరుగుతున్న ఈ-పంట ప్రక్రియను పరిశీలించారు. సూపర్ చెక్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి సంబంధిత వివరాలను సరిచూశారు. రబీ సీజన్ కు సంబంధించి వివిధ పంటలను నమోదు చేయటంలో భాగంగా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు నిర్వహించిన ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ బుధవారం సూపర్ చెకింగ్ చేశారు.