బాలల హక్కుల ప్రతినిది.సి.హెచ్ విశాలాక్షి జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవ ఎన్నిక.

బాలల హక్కుల ప్రతినిది.సి.హెచ్  విశాలాక్షి జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవ ఎన్నిక.

మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 17:

గత కొన్నేళ్లుగా బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక వార్షిక సమావేశం ఆదివారం 16వ తేదీన విజయవాడ వేదికగా నిర్వహించారు. 14 జిల్లాల ప్రతినిధులు ఈ వేదికలో పాల్గొన్నారు. ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఎం.వెంకటరెడ్డి నేత్రుత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రములో బాలల హక్కుల పరిరక్షణ గురించి చర్చిoచారు. ముఖ్యంగా వచ్చే బడ్జెట్ లో 20శాతం విద్యకు కేటాయించాలని విద్యావిధానం ప్రకటించాలని ప్రభుత్వ పాఠశాలలను  బలోపేతం చేయాలని తీర్మాణించారు. తరువాత రెండేళ్ల కాల పరిమితికి వేదిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.విశాఖ జిల్లా కన్వీనర్ గా నగరానికి చిర పరిచుతురాలు  స్వచ్ఛంద సంస్థ దాత్రి అధ్యక్షురాలు సి.హెచ్. విశాలక్షీని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమె ఎన్నిక ద్వారా విశాఖ జిల్లాకు సముచిత న్యాయం జరిగి నట్టు అయంది అని అన్నారు. ఈమె ఏకగ్రీవ ఎన్నిక పట్ల విశాఖ స్వంచ్ఛంద సంస్థల ఫోరమ్ మరియు సలహా దారుడు నరవ ప్రకాశ రావు హర్షం వ్యక్తం చేసారు.