రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర యువజన విభాగం చైర్ పర్సన్ మారుతి హరీష్ కుమార్

రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర యువజన విభాగం చైర్ పర్సన్ మారుతి హరీష్ కుమార్

విశాఖ : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 17:

సీతానగరం గ్రామంలో పోతల రాంబాబు ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర యువజన విభాగం చైర్ పర్సన్ మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రక్త దానం చేయడం చాలా అవసరమని, యువత ముందుకు వచ్చి రక్త దానం చేయాలని ఆయన కోరారు. న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ కోఆర్డినేటర్ కళ్ళ రాజేష్ మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభ అవుతున కారణంగా రక్తం నిలువలు తగ్గుతున్నాయి అని ప్రతి ఒక్కరూ కూడా రక్త దానం చేయాలని కోరారు.   రక్త దాన శిబిరం తో పాటు, మెడికల్ క్యాంప్, డెంటల్ క్యాంప్ మరియు నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నిటి మురళీ,  పోతాల నరిసింగా రావు, గ్రామ ప్రజలు తది తరులు పాల్గొన్నారు