గరిగూడి గ్రామంలో మోటరైజెడ్ బోర్ వెల్ ను ప్రారంభించిన జేసీఐ విశాఖ అచీవర్స్.

గరిగూడి గ్రామంలో మోటరైజెడ్ బోర్ వెల్ ను ప్రారంభించిన జేసీఐ విశాఖ అచీవర్స్.                              

విశాఖ : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 13:       


                  పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు సేవా కార్యక్రమలు చేయడంలో జేసీఐ విశాఖ అచీవర్స్ సంస్థ ఎప్పుడు ముందు ఉంటుంది అని విశాఖ జేసీఐ అచీవర్స్ అధ్యక్షుడు సోమశేఖర్ జేసీఐ జోన్-4 అధ్యక్షుడు సంతోష్ శివకుమార్ అన్నారు. ఈ మేరకు వన్ ఎల్ఓఎమ్ వన్ సైస్ట్ నబుల్ ప్రాజెక్టులో భాగంగా జేసీఐ విశాఖ అచీవర్స్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గరిగూడి గ్రామంలో మోటరైజెడ్ బోర్ వెల్ ను ప్రారంభించారు. అనంతరం కార్యదర్శి జేసీ శిరీషా తన జన్మదిన సందర్బంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందచేశారు. ఈ కార్యక్రమనికి జేసీఐ జోన్-4 అధ్యక్షుడు సంతోష్ శివ, ఉపాధ్యక్షులు చైతన్య, జోన్ డైరెక్టర్ బొత్స దిలీప్ పాల్గొని మాట్లాడుతూ ఈ బోర్‌వెల్ సదుపాయం గరిగూడి గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది అన్నారు. ఈ మోటరైజ్డ్ బోర్‌వెల్ ద్వారా త్రాగునీరు మరియు వ్యవసాయ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది అని  వర్షాపాతంపై ఆధారపడి ఉండే పరిస్థితిని కొంతమేర తగ్గిస్తుంది అన్నారు.

గ్రామస్థుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో జేసీఐ విశాఖ అచీవర్స్ చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. అలాగే, జేసీఐ నిర్మించిన టాయిలెట్స్ గ్రామంలో స్వచ్ఛత, హైజీన్, మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో వాటితో పాటు నీటిమూలక వ్యాధులను తగ్గిస్తుంది అన్నారు. గ్రామాల అభివృద్ధి మరియు స్థిరమైన మార్పును సాధించడంలో జేసీఐ విశాఖ అచీవర్స్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అని తెలిపారు. అవసరాలను గుర్తించి వాటిని స్వచ్ఛంద సంస్థల ద్వారా పరిష్కరించడంలో చూపిన కృషికి అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్ మురళి, శిరీషా, షీతల్ మదన్, చంద్రశేఖర్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.