విజయనగరంలో విజయవంతంగా ముగిసిన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ,
విజయనగరం :వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 17 :
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సాన సతీష్ బాబు మరియు అపెక్స్ మెంబెర్స్ ఆదేశాల మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారముతో డిఫరెంట్లీ ఏబుల్డ్ కౌన్సిల్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టాత్మకముగా క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపికలలో భాగంగా విజయనగరం జిల్లా విజి స్టేడియం నెట్స్లో ఆదివారం నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం విజయవంతముగా ముగించారు.
విజయనగరం జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి సీతారామరాజు సహకారముతో జిల్లా క్రికెట్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి సూర్యనారాయణ వర్మ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. వర్మ మాట్లాడుతూ దివ్యాంగులు వి కలాంగులతో పోటీ పడటం గర్వించతగ్గ విషయమని వీళ్ళని ప్రోత్సాహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ కి తన అభినందనలు తెలియచేశారు. మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏసీఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ దివ్యాంగుల క్రీడాభివృద్ధికి ఏసీఏ ప్రోత్సహించడం శుభపరిణామం అని అన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రికెట్ క్రీడలో అభివృద్ధి సాధించి ఏసీఏ కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ దివ్యాంగుల క్రికెట్ సెలెక్షన్స్ లో నాలుగు కేటగిరీ లకు సంబంధించి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారని పాల్గొనలేని క్రీడాకారులకు త్వరలో 2వ విడత సెలెక్షన్స్ ఏర్పాటు చేస్తామని విజయనగరం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం సలహాధారు మహేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమం వివరాలు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ, సభ్యులు సురవరపు రామన్ సుబ్బారావు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ప్రకటన ద్వారా తెలిపారు. ఇంతటి అవకాశాన్ని కల్పించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా క్రికెట్ సెలెక్టర్ సర్పరాజ్, శ్రీకాకుళం దివ్యాంగుల క్రికెట్ సంఘ ప్రతినిధులు కిరణ్ కొట్టిస, సుదర్శన్ , డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ పీడీ అడ్మిన్ అనుపమ రామ్ తదితరులు పాల్గొన్నారు.