ఇంకుడు గుంతలను పరిశీలించిన పద్మనాభం మండల టెక్నికల్ అసిస్టెంట్ మురళీ కృష్ణ.
పద్మనాభం: వి న్యూస్ : ఫిబ్రవరి 18:
పద్మనాభం మండలం, తునివలస పంచాయతీ జగనన్న కాలనీలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పద్మనాభం మండలం టెక్నికల్ అసిస్టెంట్ మురళీ కృష్ణ ప్రతి ఇంటికి వెళ్ళి గుంతలును పరిశీలించి దానికి కావలసిన మెటీరియల్స్ పంపిణీ చేసారు. ప్రతీ ఒక్కరు ఇంకుడు గుంతలను ఉంచటంవలన వర్షం నీరు కాలువలలోనికి వెళ్లి వృధా కాకుండా భూమిలోకి ఇంకుతుందని తద్వారా భూమిలో నీరు నిల్వ వుంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తునివలస పంచాయతీ వి.ఆర్.పి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.