జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే -- పాత్రికేయుల కోసం సమగ్ర చట్టం చేయాల్సిందే -- విశాఖలో కదంతోక్కిన జర్నలిస్టులు -- డీఐజీ కార్యాలయంలో వినతిపత్రం సమర్ఫణ

జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే! పాత్రికేయుల కోసం సమగ్ర చట్టం చేయాల్సిందే

విశాఖలో కదంతోక్కిన జర్నలిస్టులు-- డీఐజీ కార్యాలయంలో వినతిపత్రం సమర్ఫణ

విశాఖ : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 17:

దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి(ఎన్‌ఎజె) గంట్ల శ్రీనుబాబు కోరారు. పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని, రెండు దశాబ్ధాలుగా పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్‌ మల్వాడా రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌ నాయుడు దాడి చేయడంతో పాటు, రామారావును చంపుతానని బెదిరంచడంతో సోమవారం ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్‌, ఏపి స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లుకు స్ధానిక నాయకత్వాలు వినతిపత్రాలు అందజేశాయి. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా  విశాఖ డీఐజీ గోపినాధ్‌ జెట్టి  కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్‌ సూర్యారావు, సీసీ గణేష్‌లను కలసి వినతిపత్రం అందించారు. అంతకు ముందు ఏయూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు అందించి, అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను కాపాడాలని, అలాగే దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని , జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ నేటి తరం నాయకులు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి ఆపార అనుభవం ఉన్న నాయకులను చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని, అలా కాకుండా జర్నలిస్టులను చంపుతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు.


ఫెడరేషన్‌ రాష్ట్ట కౌన్సిల్‌ సభ్యులు మధుసూధనరావు మాట్లాడుతూ ప్రజాశక్తి పాత్రికేయుడు రామారావుపై దాడి చేసి బెదిరించిన వేణుగోపాల్‌ నాయుడును తక్షణమే అరెస్టు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మరింతగా ఆందోళన చేసేందుకు తాము సిద్దమన్నారు. ఫెడరేషన్‌ అర్భన్‌ కార్యదర్శి  జి.శ్రీనివాసరావు ఆధ్ద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఇరోతి ఈశ్వరరావు, కె. మధన్‌,ఉపాధ్యక్షడు మళ్ల దేవత్రినాధ్‌, నాయుడు,  ఏపియూడబ్ల్యూజె అర్బన్‌ కార్యదర్శి ఆర్‌, రామచంద్రరావు, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌, ప్రజాశక్తి సీనియర్‌ పాత్రికేయులు అప్పలనాయుడు, వెంకటేష్‌,ఫేడరేషన్‌, బ్రాడ్‌కాస్ట్ సభ్యులు కె.అప్పలనాయుడు, సత్యనారాయణ, పి.వెంకట్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నగేష్‌బాబు, కృష్ణమూర్తి, రామకృష్ణ, పి.సతీష్‌బాబు, కిషోర్‌, రాజేష్‌, శ్రీలత అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జర్నలిస్టుల అందించిన వినతిపత్రాన్ని అధికారులు పరిశీలించారు. తక్షణమే డీఐజీ గోపినాధ్‌జెట్టి దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.