నారాయణ కళాశాలలో విద్యార్ది ఆత్మహత్య

నారాయణ కళాశాలలో విద్యార్ది ఆత్మహత్య

మధురవాడ : వి న్యూస్ : ఫిబ్రవరి 13: 

మధురవాడ పరదేశి పాలెం నారాయణ కళాశాలలో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కళశాల మేడ పై నుండి దూకి కోన చంద్ర వంశీ అనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.  సరిగా చదవటం లేదని లెక్చరర్ మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి మృతి చెందినట్లు సీఐటీయూ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్ది స్వగ్రామం  రాయపూర్ ఒడిసా వాసిగా గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం పీఎంపాలెం పోలీసులు కేజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు ను పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.