తుమ్మిరి గడ్డ జలాశయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి: జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాస్.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 01:
రాబోయే వేసవికి నీటి ఎద్దటని తట్టుకోవాలంటే తుమ్మిరి గడ్డ జలాశయాన్ని వినియోగంలోకి తీసుకు రావాలని టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి, ఆరోవార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ కోరారు. పలు సార్లు తుమ్మిరి గెడ్డ జలాశయం కొరకు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అని అన్నారు. ప్రస్తుత భీమిలి శాసనసభ్యులు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఈ జలాశయం మీద నివేదిక తయారు చేశారు. కానీ గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ జలాశయము నేటికీ కూడా వినియోగంలోకి రాలేదు అన్నారు. ఈ ప్రాంతంలో రోజురోజుకి బహుళ అంతస్తుల భవంతులు రావడం జనాభా అధికంగా పెరిగిపోవడం ఇప్పటికే ఓటర్లు సుమారు 48000 ఉన్న ఈ ప్రాంతంలో నీటి ఎద్దటిని తట్టుకోవాలంటే ఈ జలాశయాన్ని వినియోగంలోకి తీసుకురావాలి అన్నారు. జనవరి నెలలోనే కొంత ఇబ్బందిగా ఉంటే మార్చి ఏప్రిల్ నెలలో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఈ జలాశయం నీటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాస్ కోరుతున్నారు.