గోస్తని నదిని కాపాడండి జీవీఎంసీ అధికారులను అభ్యర్ధించిన వానపల్లి సత్య
భీమిలి : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 01:
గోస్తని నదీ తీరంలో జంతు కళేబరాలు కుళ్లి దుర్గంధ భరితంగా పరిసర ప్రాంతాలు కలుషితమవుతున్నాయి అని బీసీ సాధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పద్మశాలి కమిటీసభ్యులు, జీవీఎంసీ ఫస్ట్ వార్డ్ ప్రధానకార్యదర్శి
వానపల్లి సత్య శనివారం ఆవేదన వ్యక్తం చేసారు. ఈ గోస్తని నదిని కాపాడుకోవటం ఎంతైనా అవసరం అంటూ ఆయన మాట్లాడారు.
రాత్రివేళల్లో మాంసం వ్యాపారుల ఆగడాలకు అదికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గోస్తని నదీతీరంలో గోవుల రక్తమాంసాలు ముద్దలు ముద్దలుగా పడేస్తున్నారని అన్నారు. యధేచ్చగా ఇళ్లవద్దే గోవులను వదించి వాటి వ్యర్థ్యాలను గోస్తని నదిలో పడేస్తున్నారని తెలిపారు. అక్రమంగా గోమాంసం విక్రయాలు చేస్తున్నారని అన్నారు. జీవీఎంసీ అధికారులకు అన్ని తెలిసిన సిబ్బంది చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తగరపువలసలో వారానికి సుమారు 100గోవుల (వధ) జరుగుతోందని తెలిపారు. చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇక్కడ నుండే సరఫరా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు వారిని నివారించి గోమాతను గొస్తానీ నదినీ కాపాడాలని కోరారు. బీసీ సాధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పద్మశాలి కమిటీసభ్యులు, జీవీఎంసీ ఫస్ట్ వార్డ్ ప్రధానకార్యదర్శివానపల్లి సత్య కోరుతున్నారు.