మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట – బడ్జెట్ 2025పై విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పందన
విశాఖపట్నం: వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 01:
కేంద్ర బడ్జెట్ 2025లో ₹12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్నుమినహాయింపు* ప్రకటించడం ద్వారా *ఎన్డీఏ ప్రభుత్వం* మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. "ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఆర్థికమంత్రి * నిర్మలా సీతారామన్* తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం *మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పించడమే కాకుండా, దేశీయ వినియోగాన్ని పెంచి, పెట్టుబడులను ప్రోత్సహించి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది*" అని ఎంపీ శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. *విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందుతున్న నగరానికి ఈ పన్ను మినహాయింపు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది*. వేతన జీవులు, వ్యాపారవేత్తలు, నూతన వ్యాపార యజమానులు ఎక్కువ ఆదాయం పొందే అవకాశముంటుందని శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. "మధ్య తరగతి ప్రజలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ బడ్జెట్ ద్వారా పన్ను విధానాన్ని మరింత సౌకర్యవంతం చేయడంతోపాటు, సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చేలా చర్యలు తీసుకుంది" అని ఆయన తెలిపారు.