అన్నాకేoటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా

అన్నాకేoటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా

మారికవలస: వి న్యూస్ : జనవరి 22: 

మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో అన్నక్యాంటీన్ ను మాజీ మంత్రివర్యులు భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం స్థానికులతో కలిసి గంటా శ్రీనివాస్ రావు భోజనం చేసారు.  ఆహారం నాణ్యత పెంచాలని శుభ్రత పాటించాలని అన్న క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు.అన్నా క్యాంటీన్ లో సాయంత్రం త్రాగుబోతులు, గంజాయి గాళ్ళు తో చాలా ఇబ్బందిగా ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లగ స్థానిక పోలీసులకు ఈ సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసారు.