నూతన పాఠశాల భవనము ప్రారంభించిన ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు.
గాజువాక : వి న్యూస్ ప్రతినిధి : జనవరి 22:
కార్పొరేటర్ పుర్రె పూర్ణ సురేష్ ఆధ్వర్యంలో ములగాడ ఎన్జిజిఓ కాలనీలో సుమారు 2.07 కోట్ల రూపాయలు నిధులతో పిల్లలకు సకల హంగులతో నిర్మించిన నూతన పాఠశాల భవనమును పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ప్రారంభం చేసారు. ముందుగా గణబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేసారు. వార్డు కార్పొరేటర్ పూర్ణ కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే గబాబాబుతో కలిసి నూతన భవనం కి రిబ్బన్ కట్ చేసి ప్రారంబోశ్చవం చేశారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఇంత సుందరంగా నిర్మించిన భవనాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచి మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఆయన పాఠశాల విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులు ఆరోగ్య కార్డులు పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటరావు, ప్రధానోపాధ్యాయులు చంద్రకుమారి, పశ్చిమ జనసేన ఇన్చార్జి అంగ ప్రశాంతి, పశ్చిమ జనసేన నాయకులు సురేష్ యాదవ్, నక్క లక్ష్మణ్, పూడి విజయ్ భాస్కర్, మిత్తిరెడ్డి శంకర్, రాము, బీజేపీ సీనియర్ నాయకులు గురుమూర్తి, రామకృష్ణ, సతీష్, 59 వార్డు కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు .