సంక్రాంతి సంబరాల కోలాటం పోటీలలో ప్రధమ బహుమతి మధురవాడ శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం

ఏయూ గ్రౌండ్లో నిర్వహించిన జీవీఎల్ సంక్రాంతి సంబరాల కోలాటం పోటీలలో ప్రధమ బహుమతి మధురవాడ శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం.             విశాఖ : వి న్యూస్ : జనవరి 15: 

బృందం గురువు సిరిపురపు సంతోషికి బహుమతి అందచేసిన ఐడిబీఐ ఏజిఎం నరేష్.*            

*శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు సునీత ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులను కోలాటం విజేతలను సత్కరించిన మాజీ రాజ్య సభ సభ్యులు జీవీఎల్.*           


   

ఆంధ్ర యూనివర్సిటీ విశ్వ విద్యాలయంలో జివిఎల్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో సంక్రాంతి పర్వదినాన మంగళవారం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో పట్టణంలో పల్లె వాతావరణం తలపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా ఏర్పాట్లు చేసారు. ఈ సంబరాలు జనవరి 11నుండి 14వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలో ఉండేవారు పల్లెలను సందర్శించే ఆహ్లాదం పొందేందుకు ఆసక్తి చూపుతూ భారీగా పాల్గొన్నారు. సంబరాలలో ముఖ్యంగా హరిదాసులు. బసవన్నలు పల్లె నివాసాల వద్ద ఫొటోలు దిగేందుకు ఎక్కువ ఆశక్తి కనబరిచారు. మూడురోజులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి మాజీ రాజ్య సభ సభ్యులు జీవీఎల్ దుష్షాలువాలతో సత్కరించి మోమేంటోలు అందచేసి బహుమతి ప్రధానం చేసారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు, సునీత, కల్యాణి ఆధ్వర్యంలో    కోలాటం నృత్యం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 45 బృందాలనుండి 510 మంది సభ్యులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కొళాటం పోటీలలో మధురవాడ నుండి పాల్గొన్న శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం గురువు సిరిపురపు సంతోషి బృందం నకు ప్రముఖ ఐడిబీఐ ఏజిఎం నరేష్ చేతుల మీదుగా మాజీ రాజ్య సభ సభ్యులు జీవీల్ ప్రధమ బహుమతిని అందచేశారు. ఈ కార్యక్రమంలో జీవీల్ మంగళవారం మాట్లాడుతూ ప్రస్తుత ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలుగు ప్రజలను ఉద్దేశించి పంపించిన వీడియోను స్క్రీన్ పై ప్రదర్శించారు. అనంతరం సంక్రాంతి కార్యక్రమాలలో సాంస్కృతికి కార్యక్రమాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి సైబర్ క్రైమ్ లో ఎవరైనా బాధితులు నష్టపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సీనియర్ కామెడీ నటులు రాజబాబు ఎంతగానో కామెడీ మరియు డాన్స్ తో అలరించి సందర్శకులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు సునీత మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక బృందాలతో దేవాలయాలలో హిందూ ఉత్సవాలలో హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవాలయాలలో సేవా కార్యక్రమాలు కోలాట నృత్య ప్రదర్శనలు చేస్తూ రాబోయే తరం మరింత ఆశక్తి కనబరిచే విధంగా ప్రదర్శనలు ఇస్తున్నామని తెలిపారు. మాజీ రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో అవకాశం ఇచ్చినందుకు జీవీఎల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.