ఎమ్మెల్యే గంటా సందర్శనకు అఘ మేఘాలపై రహదారులు శుభ్రం
మధురవాడ : వి న్యూస్ : జనవరి 02:
రేవళ్ల పాలెంలో గురువారం ఎమ్మెల్యే గంటా సందర్శనకు వస్తున్నట్లు సమాచారం అందించారు. ఆయన సందర్శనకు హుటాహుటీన రహదారులను శుభ్రపరిస్తున్నారు. ఎమ్మెల్యే గంటా రాకతో అధికారులు హడావుడి చేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. జీవీఎంసీ అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు వస్తేనే శుభ్రం లేదంటే శుభ్రం చేయరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.