జేసీ మయూర్ అశోక్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన విశాఖ ఉమ్మడి మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం సభ్యులు

జేసీ మయూర్ అశోక్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన విశాఖ ఉమ్మడి మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం సభ్యులు

 మధురవాడ : న్యూస్ విజన్ : జనవరి 01: 


విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే ఆర్ ఆర్ సి శైలజ, సచివాలయం శాఖ డి ఎల్ డి ఓ అధికారిని ఉషా రాణిని, మరియు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అశోక్ ను ఉమ్మడి విశాఖ మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కార్యదర్శి నాగు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మీసేవ నిర్వాహకులు అందచేస్తున్న సర్వీసులు, ఆపరేటర్లు నిర్వహిస్తున్న తీరు, ఆపరేటర్ల సమస్యల వివరాలు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అడిగి తెలుసుకున్నారు. మరి కొద్ది రోజులలో మీసేవ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులతో సమావేశం అయ్యి మీసేవ సెంటర్ల పై పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆన్లైన్ డి ఎం రాజేష్, ఉమ్మడి విశాఖ మీసేవ ఆపరేటర్ల సంఘం సభ్యులు డి వి ఎన్ శ్రీనివాస్, వెన్న నాగరాజు, సిరిపురపు శ్రీహరి, పి సాయి రామ్ గుప్తా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.