డ్రగ్స్, గంజాయి పై అవగాహన కార్యక్రమంలో విశాఖ జిల్లా జడ్జి వెంకట శేషమ్మ పాల్గొన్నారు

డ్రగ్స్, గంజాయి పై అవగాహన కార్యక్రమంలో విశాఖ జిల్లా జడ్జి వెంకట శేషమ్మ పాల్గొన్నారు.  

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 31: 

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రగ్స్, గంజాయిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖ జిల్లా జడ్జి వెంకట శేషమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాల వలన ప్రజలలో మార్పు అనేది వస్తుందని తెలిపారు. స్నేహితుల ప్రభావంతో యువత చెడిపోతున్నారు.
అవగాహన లోపం వల్ల యువత ఏటి వెళ్తుంది అనేది తెలియని పరిస్తితి ఉంది. నేరాన్ని ప్రేరేపించిన వారు కూడా నేరస్థులు క్రింద పరిగణించబడుతుంది. ఎక్కువగా గంజాయికి యువత బానిస అవుతున్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలి. ప్రాణం విలువ చాలా విలువైనది అని సూచించారు.