చేనేత పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కార్మికులుగా కాదు, కళాకారులుగా గౌరవించుకోవాలి. మేళా ప్రారంభోత్సవంలో మగ్గం నేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా

చేనేత పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కార్మికులుగా కాదు, కళాకారులుగా గౌరవించుకోవాలి. మేళా ప్రారంభోత్సవంలో మగ్గం నేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా

మధురవాడ: వి న్యూస్ : డిసెంబర్ 13:

చేనేత వస్త్రాలకు తమ కళా నైపుణ్యంతో వన్నె తెస్తున్న వారిని కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. "నా చేనేత - నా ఆత్మ గౌరవం" పేరుతో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మధురవాడ శిల్పారామంలో ఏర్పాటు చేసిన చేనేత మేళాను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక చేనేత కుటుంబమంతా కనీసం రెండు వారాలు కష్టబడితేనే ఒక చీర తయారవుతుందని చెప్పారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఖ్యాతి తెలుగు రాష్ట్రాల నేత కళాకారులదని, వారానికి ఒకసారి చేనేత, ఖాదీ వస్త్రాలను ధరించి ఆ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో యూనిఫారాల సరఫరా ఆప్కోకు ఇవ్వడం ద్వారా అనేకమంది నేతన్నలకు ఉపాధి కలుగుతుందన్నారు.


విద్యుత్తు, రుణ రాయితీలతో మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేట్టు చేస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పాల్గొంటున్న చేనేత, హస్త కళల కళాకారుల కోసం 14 రోజుల పాటు మేళాలో ఉచితంగా 64 స్టాల్స్ ఏర్పాటు చేసి, టి.ఎ., డి.ఎ.లు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. 2014-2019లో శిల్పారామంలో ప్రతిరోజూ నైట్ బజార్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారమని చెప్పారు. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తో చర్చించి శిల్పారామాన్ని పి.పి.పి. మోడల్ లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు దాసరి శ్రీనివాస్, శాఖారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.