భీమిలి నియోజకవర్గం వైస్సార్సీపీ అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్??
భీమిలి : వి న్యూస్ : డిసెంబర్ 14:
శనివారం ప్రకటించే అవకాశంభీమిలి నియోజకవర్గం వైస్సార్సీపీ అధ్యక్షులు గా ఉన్న మాజీ మంత్రి మాజీ భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ ఇటీవల పార్టీ కి రాజీనామా చేసిన విషయం విధితమే. ఆయన ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని మీడియా సమావేశంలో వెల్లడిస్తూ వైస్సార్సీపీ కి రాజీనామా చేసారు. ప్రస్తుతం విశాఖలో కీలకమైన భీమిలి నియోజకవర్గంలో వైస్సార్సీపీ ని నడిపించే నాయకుడు లేకపోవటంతో మాజీ మంత్రి విశాఖ వైస్సార్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ కి ఆ భాద్యతలు అప్ప చెప్పే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం పెద్దిపాలెం మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భీమిలి పగ్గాలు చేపడుతున్నట్లు ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నట్లు సమాచారం. మరి ఆయన భీమిలి పగ్గాలు చేపడతార లేదా అనేది చూడాలి అనే విషయం పై వేచి చూడాలి.