5వ వార్డులో యుజీడి సమస్య పరిష్కరించాలి! జీవీఎంసీ కమిషనర్ కు 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత వినతి

5వ వార్డులో యుజీడి సమస్య పరిష్కరించాలి! జీవీఎంసీ కమిషనర్ కు 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత వినతి 

మధురవాడ: వి న్యూస్ : డిసెంబర్ 12: 


 దశాబ్దాల కాలంగా ఐదవ వార్డ్ పరిది రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీ, jnnurm కాలనీలలో పరిష్కారం కానీ యుజిడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. 


జరిగిన అన్ని కౌన్సిల్ సమావేశాలలో యుజిడి సమస్య పరిష్కరించాలని తెలియజేసానని తద్వారా సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు అయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా జరిగిందని సంబంధిత అధికారులు చెప్పారని కానీ ఇంతవరకు అక్కడ ఎటువంటి పనులు చేపెట్టలేదని, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని,అలాగే వార్డులో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యంగా త్రాగునీరు, వీధిలైట్లు సమస్య ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని,స్మశాన వాటికలు అభివృద్ధి పనులను మధ్యలోనే నిలిపివేశారని వెంటనే అవి పూర్తి చేయాలని, కొండవాలు ప్రాంతాలలో రోడ్లు,కాలువలు మరియు మెట్ల మార్గాలు తదితర సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కు వినతిపత్రం రూపం లో తెలియజేయడమైనదని,తొందర్లోనే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.