*అమనాం ఎస్సీ బీసీ కాలనీలో 40ఏళ్ల రహదారి నిరీక్షణకు మోక్షం.*
పద్మనాభం : వి న్యూస్ : డిసెంబర్ 31:
*భీమిలి శాసనసభ్యులు గంటా ఆదేశాలతో అమనాం గ్రామంలో నూతన రహదారులు.*
*గంటాకు జేజేలు కొడుతున్న అమనాం గ్రామస్తులు.*
40ఏళ్ల రహదారి నిరీక్షణకు భీమునిపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో మండల తెదేపా ఉపాధ్యక్షులు డిఏఎన్ రాజు చొరవతో మోక్షం కలిగింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం ఎస్సీ బీసీ కాలనీలో 40ఏళ్ల క్రితం ఇళ్లను నిర్మించారు. 1983 - 84 సంవత్సరంలో తెదేపా హయాంలో ఎస్సీ బీసీ కాలనీ నిర్మాణం జరిగింది. అప్పటినుండి రహదారి కాలువ నిర్మాణం లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గతంలో మూడు సార్లు రహదారికి నిధులు మంజూరైనప్పటికీ స్థానిక నాయకులు ఈ ప్రాంతంలో విద్వేశాలు రెచ్చగొట్టి రహదారి నిర్మాణం జరగకుండా నిలుపుదల చేశారు.
మరో వైపు వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక వైకాపా నాయకులు రహదారి నిర్మాణం చేపట్టి తెదేపా కార్యకర్త కర్రి బంగార్రాజు ఇంటికి 50 అడుగుల రహదారిని వేయకుండా కక్షపూరితంగా విడిచిపెట్టారు. అసంపూర్తిగా ఉన్న ఈ రహదారిని సైతం కూటమి నాయకులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చిన మొదటి గ్రాంట్ ను వివాదాస్పదమైన పోలమ్మ తల్లి అమ్మవారి గుడికి రహదారి నిర్మాణం చేపట్టారు. అనేకమందిని సామరస్యంగా కలుపుకుంటూ అభివృద్ధిలో మేము సైతం అనేలా గ్రామ తెదేపా అధ్యక్షులు చుక్క ఆదిరెడ్డి, మాజీ సర్పంచ్ దంతులూరి నృసింహ సత్యన్నారాయణ రాజు అద్వర్యంలో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా 40 ఏళ్ల క్రితం నుండి రహదారిలేని ప్రాంతానికి, వైకాపా ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలుపుదల చేసిన మిగులు రహదారిని రాజకీయాలకతీతంగా స్థానిక కూటమి నాయకులు మరగడ రఘురాంరెడ్డి, కంబపు శివకుమార్, బోర గురు నాయుడు, కొల్లి నర్శిమ్మ, మునకాల అనిల్ కుమార్, కడారి మున్నా, అడపా వేణు దొర ల నాయకత్వంలో పూర్తి చేశారు. అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. 37-4 సర్వేనెంబర్ సబ్ డివిజన్ లో ఉన్న 0.28 సెంట్లు కాలనీ మిగులు భూమిని స్వాధీనం చేసుకుని మిగిలిన రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.