మండు ఎండలో ఆగని అవంతి ఎన్నికల ప్రచారం - ప్రజలకు మంచి చేయాలన్నదే నా ఆలోచన అవంతి

మండు ఎండలో ఆగని అవంతి ఎన్నికల ప్రచారం - ప్రజలకు మంచి చేయాలన్నదే నా ఆలోచన అవంతి 

భీమిలి: వి న్యూస్ : మే 05:

మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 98వ వార్డులో 41వరోజు ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. 41వరోజు ఎన్నికల ప్రచారంకి విచ్చేసిన అవంతికి భారీ బైక్ ర్యాలీతో - తీన్మార్లతో - అడుగడుగునా మంగళ హారతులు తో - జై జగన్ జై అవంతి నినాదాలతో ఘనమైన సాదర స్వాగతం పలికిన 98వ వార్డు వైసిపి శ్రేణులు మండు ఎండలో అలుపెరగని బాటసారి వలే దూకుడుగా ఎన్నికల ప్రచారంలో గడప గడపలో దూసుకుపోతున్న ప్రజాసేవకుడు అవంతి ప్రచారంలో బాగంగా ప్రజలను మన గుర్తు ఏంటని అడగగా సoక్షేమంతో పేద మధ్యతరగతి బడుగు వర్గాల వారి జీవితాలు లో వెలుగులు నింపి వారి ఇంట్లో చిరునవ్వులు చిందించి - భయం లేని లంచాలు లేని - ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్దితి ని మార్చి నేరుగా మా గడప వద్దకే పథకాలు అందించిన ప్యానే మా గుర్తు - మీరే మా యంయల్ఏ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వార్డులో 5ఏళ్ళలో జగనన్న పాలనలో అవంతి చొరవతో చేసిన అభివృద్ధి పనులను అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన కోసం వార్డు అద్యక్షులు వర్మ బాబు ప్రజలకు వివరించారు