వైయస్సార్సీపి మేనిఫెస్టోలో వికలాంగులకు అన్యాయం!!!!!!
నంధ్యాల : వి న్యూస్ : ఏప్రిల్ 27:
వైయస్సార్సీపి పార్టీ విడుదల చేసిన మ్య నిఫెస్టోలో పెన్షన్ల పెంపు 3500 అని చెప్పారు కానీ అందులో వికలాంగుల పూసే లేదని వికలాంగులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేశారని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి విమర్శించారు.
డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీపీ మస్తాన్ వలి మాట్లాడుతూ......
గత ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వికలాంగులు ఎన్నికల ముందు మేనిఫెస్టోలలో వికలాంగుల పెన్షన్ 6000 కు పెంచుతారని చాలా ఆశగా ఎదురు చూశారని ఆ ఆశలపై వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో లో పెన్షన్లు కేవలం 3500 పెంచుతున్నామని అది కూడా 250 రూపాయల ప్రకారము రెండు విడుదలుగా ఐదు సంవత్సరాలలో పెంచుతామని చెప్పి వికలాంగుల ఆశలపై నీళ్లు చల్లారని, వికలాంగులకు పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు.
మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 6,116 రూపాయలు ఇస్తున్నారని, ఏపీలో టిడిపి పార్టీ మేనిఫెస్టోలో 6000 రూపాయలు పెట్టిందని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 6000 రూపాయలు పెట్టిందని, ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రం వికలాంగులకు వికలాంగుల పెన్షన్ పెరుగుతున్న నిత్యవసర వస్తువులను, అలాగే కరెంటుచార్జీలు, గ్యాస్ ధరల పెంపునకు అనుగుణంగా పెన్షన్ 6000 రూపాయలు ఇవ్వకుండ వికలాంగులకు అన్యాయం చేసిందని, వికలాంగులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారికి వికలాంగులు అంటే కనపడటం లేదా అని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కేవలం వికలాంగుల సమాజానికి మాత్రం ద్రోహం చేస్తున్నాడని, రాబోయే ఎన్నికలలో ఆ వికలాంగులతో సహా సామాజిక పెన్షన్ దారులు కూడా వైయస్సార్సీపి పార్టీకి వికలాంగుల సత్తా ఏమిటో చూపిస్తారని మస్తాన్ వలి అన్నారు .
ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు నబి రసూల్, సభ్యులు ముస్తఫా, భాష తదితరులు పాల్గొన్నారు.