గంటా శ్రీనివాస్ ని కలిసిన రేఖవానిపాలెం పంచాయితీ టీడీపీ, జనసేన నాయకులు

గంటా శ్రీనివాస్ ని కలిసిన రేఖవానిపాలెం పంచాయితీ టీడీపీ, జనసేన నాయకులు 

భీమిలి: వి న్యూస్ : ఏప్రిల్ 22:

భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయితీ నుంచి భీమిలి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి గంటా శ్రీనివాస్ రావుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి పంచాయితీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు యరబాల.అనిల్ ప్రసాద్ భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాస్ గెలిచి తప్పకుండా మంత్రి అయి తీరుతారు అని తెలిపి రాష్ట్ర ప్రజలు పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అది నిజం అయ్యి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేసిన కిరణ్ మాట్లాడుతూ రేఖవానిపాలెం పంచాయితీ నుంచి అత్యధిక మెజారిటీ తీసుకు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకుని ఉమ్మడిగా పని చేస్తున్నాం అని తప్పకుండా మెజారిటీ సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ భీమిలి మండల అధ్యక్షులు డి.ఎ.ఎన్ రాజు, రేఖవానిపాలెం పంచాయితీ తెలుగుదేశం నాయకులు మల్లేటి.మహేష్ వర్మ , తామాడ.శ్రీను మరియు నాయకులు పాల్గొన్నారు.అనంతరం విశాఖ జిల్లా యంపీ అభ్యర్ధి భరత్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.