ఉప్పాడ గొల్లలపాలెంలో వేణు గోపాల స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట

ఉప్పాడ గొల్లలపాలెంలో వేణు గోపాల స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట 

భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 22 : 

ఉప్పాడ గొల్లలపాలెంలో వేణు గోపాల స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిరత మహరతులు ఎందరో పాల్గొని విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్బంగా మధురవాడ నుండి శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం అధ్యక్షులు సిరిపురపు సంతోషి నేత్రుత్వంలో పీఎంపాలెం, నగరంపాలెం, ఉప్పాడ నుండి బృందం సభ్యులు స్వామి వారి ప్రాంగణంలో కోలాట నృత్యం ప్రదర్శన చేసి ఆలయంనకు వచ్చిన అతిరత మహారదులను, భక్తులను, ఆలయ నిర్వాహకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమణ, వరహాలు, నర్సింగ రావు, మాజీ ఎంపీటీసీ కోడిబోయిన నర్సింగరావు, మాజీ సర్పంచ్ ఎల్లాజీ, డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.