పేదలకు పెత్తందారులుకు జరిగే యుద్దంలో జగనన్నదే అంతిమ విజయం అంటున్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి
భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 14:
*రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి - విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ -యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీ - పసుపులేటి బాలరాజు - విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి మండలం మజ్జివలసలో మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు**సమావేశంకి విచ్చేసిన ముఖ్య అతిథులుకి అవంతి పిలుపుతో ఘనమైన సాదర స్వాగతం పలికిన భీమిలి మండలం వైసిపి శ్రేణులు*
*కార్యక్రమం లో కళాకారులు సాంప్రదాయ సాంస్కృతిక ఆటపాట నృత్యాలుతో అందరిని అలరించారు*
*కార్యక్రమం ను ఉద్దేశించి సభాద్యక్షులు అవంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోడ్పాటుతో మునపు ఎన్నడూ ఏ పార్టీ చేయలేని విదంగా భీమిలి నియోజకవర్గం లో ఈ 5ఏళ్ళ లో సంక్షేమం క్రింద 2,500 కోట్లు అభివృద్ధి క్రింద 500 కోట్లు ఖర్చు చేసి పార్కులు,సిసి రోడ్లు డ్రైనేజీ లు ఇంటింటి కొళాయిలు అలాగే వాటర్ ట్యాంక్ లు బిటి రోడ్లు ఇలా చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగిందని,గడప గడపలో మన సంక్షేమ పథకాలు అందాయని,జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన విశాఖ రాజధానిగా అవ్వడం తో పాటు మన భీమిలి కి మంచి ప్రాదాన్యత ఉంటుంది అలాగే మంచి పరిశ్రమలు వచ్చి చదువుకున్న వారికి ఉపాదులు కలుగుతాయి.మంచి అభివృద్ధి తో పాటు భవిష్యత్తు ఉంటుంది కనుక నాయకులు కార్యకర్తలు ప్రజలు మద్యకు వెళ్ళి మనం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలనను వివరిస్తూ ప్యాన్ గుర్తు పై ఓటేసి గెలిపించాలని కోరాలని పిలుపునిచ్చారు*
*కార్యక్రమం ను ఉద్దేశించి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు మనకు అందరికి చాలా కీలకమైనవని ప్రతీ నాయకుడు , కార్యకర్త గ్రహించి వైసిపి పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది ఒక కుటుంబంలో అంతా ఒకటే అయినా అందరి మనోభావాలు ఒకేలా ఉండవు ఓకే పార్టీలో మనలో మనకు చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి అవి మనం విడిచిపెట్టి ఓకె తాటిపై నిలిచి కష్టపడి బాధ్యత తో పని చేసి పార్టీ ని అధికారం లోకి తీసుకొని రావాలని,పార్టీ అధికారం లో ఉంటేనే మనకు విలువ ఉంటుంది అని, ఇక్కడ పేరుకే భీమిలి మండలం జనాభా అయినా భీమిలి సముద్రం అంత అశేషంగా ఉందని మీరంతా ఇదే విధంగా ఒకే తాటిపై నిలిచి భీమిలి నుంచి అత్యధిక మెజారిటీ అందివ్వాలని, సోదరుడు అవంతి పాలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎనలేనంత నమ్మకం ఉందని,అందుకే మరల ఆయనకే భీమిలి యంయల్ఏ సీటు ను కేటాయించడం జరిగింది కనుక ప్రతీ ఒక్కరు అవంతి గెలుపే లక్ష్యంగా గడప గడపకు వెళ్ళి ప్రజలకు ఈ 5ఏళ్ళలో అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి గెలిపించాలని పిలుపునిస్తూ మాట్లాడారు*
*అనంతరం విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ గత టిడిపి పాలనలో పథకాలు అమలు చేయాలంటే పసుపు చొక్కా వేసుకున్న వారికి అలాగే చంద్రబాబు నాయుడు నియమించిన జన్మభూమి కమిటీలు వారు చెప్పిన వారికి ఇవ్వడం జరిగింది అని,టిడిపి ప్రభుత్వ పాలనలో టిడిపి వారు కార్యకర్తలు బాగుపడ్డిరని,వైసిపి ప్రభుత్వం ఏర్పాఢ్డాక జగనన్న పాలనలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా జగన్ మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కితే నేరుగా లబ్దిదారులు కు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అని,గత పాలనలో ప్రజలు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్దితి ఉండేది జగనన్న పాలనలో వాలంటీర్లు సచివాలయం వ్వవస్థ ద్వారా గడప వద్దకే అందిస్తున్నాం కనుక మీ ఇంట్లో మంచి జరిగింది అనిపిస్తే నాకు ఓటు వేయండి అనిన జగనన్న లా ఓటు అడిగే హక్కు మనకు మన నియోజకవర్గం లలో ఉంది కనుక జగనన్న వస్తేనే మళ్ళీ ఇలాంటి మంచి పాలన అందుతుంది పొరపాటున టిడిపి వస్తే పథకాలు తీసివేస్తారు మళ్ళీ లంచాలు కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్దితి కనుక మీరంతా కష్టపడి అవంతి ని అఖండ మెజారిటీతో గెలుపించాలని పిలుపునిచ్చారు*
*యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఆడనడుచును అయిన నాకు ఆదివారం భీమిలి లో ప్రజాదరణ చూస్తుంటే నా పుట్టినిల్లు ఆదరణ ఏకోశాన తీసి పోలేదని,జగనన్న పాలన కోసం నాకంటే మీకే బాగా తెలుసునని,జగనన్న పేదల ప్రభుత్వం అని,పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే జగనన్న పాలన లక్ష్యం అని,దేశంలో మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుభిక్షమైన పాలన అందించి రాష్ట్రంలో పేదరికపు సగటు తగ్గించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని,మళ్ళీ ఆయనే ముఖ్య మంత్రిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీవెనలతో వస్తారని,ఆయన గడప గడపలో మరింత సంక్షేమ పథకాలు అమలు పాలన అందిస్తారని మీకు అన్నం పెట్టే జగనన్న కావాలో సున్నం పెట్టే చంద్రబాబు కావాలో మీకు మీరే ఆలోచించుకొని రాబోయే ఎన్నికల్లో ప్యాన్ గుర్తు పై ఓటేసి నన్ను యంపి గా సోదరుడు అవంతి ని యంయల్ఏ గా అఖండ మెజారిటీతో గెలుపించాలని మాట్లాడారు*
*ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు కోలా గురువులు - మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులెటి బాలరాజు - ఉమ్మడి విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు - వార్డు కార్పోరేటర్ లు - వార్డు ఇంచార్జ్ లు - వార్డు ప్రెసిడెంట్ లు - మూడు మండలాల యంపిపి లు జెడ్పిటిసి లు - వైస్ యంపిపి లు - సర్పంచ్ లు - యంపిటిసి లు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు*