విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వాండ్రాసి నాగ సత్యనారాయణ ( జై శ్రీరామ్ )
మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 25:
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్టణం పార్లమెంటు స్థానానికి ఏడో రోజు బుధవారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఆర్.వో.,జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జునను తన కార్యాలయంలో కలిసి అభ్యర్థులు సంబంధిత పత్రాలు అందజేశారు. మృధుస్వభావి, నిరాడంబరుడు, ఆప్యాయంగా జై శ్రీరామ్ అండి నినాదంతో పలకరింపు, శత్రువునైనా తన చిరునవ్వుతో అక్కున చేర్చుకునే స్వభావం, మహా మేధావి, ఆపద అని ఆయనకు తెలిస్తే అర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆదుకోవడం ఆయన నైజమ్. మధురవాడకు చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ ( జై శ్రీరామ్), ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి కొంగరాపు గణపతి, స్వతంత్ర అభ్యర్థులుగా కర్రి వేణుమాధవ్, గాదం అప్పల నరసింహ ఆనంద్, భారత చైతన్య యువజన పార్టీ నుంచి మురపాల అచ్యుత కిరణ్ బాలాజీ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జై మహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు నామినేషన్లు దాఖలు చేసారు. సంబంధిత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించారు.