భీమిలి నియోజవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక
భీమిలి: వి న్యూస్ : ఏప్రిల్ 14:
భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ మూడవ వార్డు గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఆవాల సూరిబాబు, ఎర్రిబాబు, సీరా అప్పలస్వామి, గొలగాని సుధాకర్, జిబిడి అప్పలరాజు, వియ్యపు తిరుపతిరావు, పిన్నింటి సురేష్, వలస తిరుమలరెడ్డి, పీతల అప్పలరాజు, పీతల చిన్న, గుడ్డాల కనకరాజు, వియ్యపు శ్రీకాంత్, గుడ్డాల పవన్, వియ్యపు మధు, మొదలగు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు మరో 100 మంది కార్యకర్తలతో భీమిలి నియోజకవర్గ అభ్యర్థి * గంటా శ్రీనివాసరావు* సమక్షంలో గాడు అప్పలనాయుడు, గాడు సన్యాసిరావు, గొలగాని నరేంద్ర ఆధ్వర్యంలో గంటా శ్రీనివాసరావు నివాసం ఎంవిపి కాలనీలో తెలుగుదేశం పార్టీలో చేరారు.అలాగే ఎనిమిదో వార్డు ఎండాడ, సాగర్ నగర్ కి చెందిన యు రాంబాబు, యు జయబాబు, శంకర్ మహేష్, గోపి, ప్రసాద్, శ్రీను మరో 40 మంది వైసీపీ నాయకుల మరియు సుమారు 200 మంది కార్యకర్తలు 8వ వార్డు ప్రెసిడెంట్ చెట్టుపల్లి గోపి తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు, నాయకులకు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయి తీరాలని ఈ సందర్భంగా సూచించారు.