భీమిలిలో స్వస్వార్థ పాలన పోవాలి - అవంతి సంక్షేమ పాలన రావాలి అంటున్న ప్రజానికం
భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 27:
34వ రోజు కూడా మండు ఎండలో మళ్ళీ గెలిచి భీమిలి ప్రజలకు మంచి సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్నికల ప్రచారం లో అలుపెరగని బాటసారై దూసుకుపోతున్న అవంతి
భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 89వ వార్డు భగత్ సింగ్ నగర్ - చాకిరేవు పేట లో 34వ రోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది
కార్యక్రమం కి విచ్చేసిన అవంతికి స్థానికులు నాయకులు కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు
కార్యక్రమంలో బాగంగా అవంతి రాబోయే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం లో ప్యాన్ గుర్తు పై ఓటేసి నన్ను మూడోసారి - విశాఖ జిల్లా యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీని గెలిపించి జగనన్న ను ముఖ్యమంత్రిని చేయడానికి మీరంతా సిద్దమా అని అడగ్గానే మీమంతా సిద్దం అంటూ మహిళా అక్కాచెల్లెళ్ళు నినాదాలతో హోరెత్తించారు
కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలనలో వైసిపి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలు తో పాటు యస్సి,యస్టి.బిసి.మైనారీటీలకు అన్నింటా పెద్దపీట వేయడమే కాక, రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా సంతోషం గా ఉండాలనే ఆలోచనతో రాష్ట్రం అంతటా సంక్షేమం దిశగా అడుగులు వేసారని,గత ప్రభుత్వాలు గత పాలకులు బడుగు బలహీన వర్గాల వర్గాల వారిని కేవలం ఎలక్షన్ లో అధికారం పొందేందుకు ఓటు బ్యాంకు గానే చూస్తే జగన్ మోహన్ రెడ్డి మాత్రం సామాజిక న్యాయం చేసి సమానత్వం సౌభ్రాతృత్వం అనే విషయాన్ని చేతుల్లో చేసి చూపారని,మాటలతో కోటలు కట్టడం జగనన్న రాదు చేతలతో చేసి చూపించడమే ఆయనకు తెలిసిన పాలన ఆయన పార్టీలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం గా ఉన్నారని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా రాబోయేది వైసిపి ప్రభుత్వం అని, సమయం ఎక్కువ లేనందున నాయకులు కార్యకర్తలు భాద్యత వహించి రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని అలాగే ఇదే భీమిలి లో మీ అందరి చల్లని దీవెనలతో గెలిపించారు గతం లో భీమిలి అభివృద్ధి కి ఇప్పటి అభివృద్ధి కి ఎంత తేడా ఉందో మీకు తెలుసు కనుక నిత్యం మీ మద్య ఉండి మీ సమస్యలు అడిగి తెలుసుకునే నేను కావాలో ఎలక్షన్ రోజు కనిపించి తరువాత ఏనాడు కనపడని వాళ్ళు కావాలో మీకు మీరుగా ఆలోచించుకొని భీమిలి లో ప్యాన్ గుర్తు పై ఓటేసి ముచ్చటగా మూడోసారి నన్ను యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తూ మాట్లాడారు ఈ ప్రచార కార్యక్రమంలో 89వ వార్డు వైసిపి శ్రేణులు - ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు- సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు - ప్రజలు పాల్గొన్నారు