నిరాశపరిచిన వైసీపీ మేనిఫెస్టో

నిరాశపరిచిన వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ వైసీపీ

ఏపీ : వి న్యూస్ : ఏప్రిల్ 27: 

అభిమానులను పూర్తిగా నిరాశకు గురిచేసింది. నవరత్నాలు ప్లస్ అంటూ రిలీజ్చేసిన మేనిఫెస్టోలో పథకాలకు నగదు పెంచడం మినహా కొత్తదనం ఏమి కనిపించలేదు. ప్రధానంగా పెన్షన్ కనీసం రూ.4వేలు అయినా ఇస్తాడని భావించిన వికలాంగులు, అవ్వతాతలకు నిరుత్సాహమే మిగిలింది. రుణమాఫీ ఉంటుందని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. కొత్తగా హామీలులేకపోవడంతో ప్రజల్లో వైసీపీపై అనాశక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ మేనిఫెస్టో తో నేటినుండి జనంలోకి వైస్సార్సీపీ క్యాడర్ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు సైతం జగన్ ఇంత సమయం తీసుకుని అద్భుతమైన మేనిఫెస్టో విడుదల చేస్తారనుకుంటే అందరినీ నిరాశ పరిచే మేనిఫెస్టో విడుదల చేశారని వైస్సార్సీపీ వర్గాలలోనే తీవ్ర నిరాశతో చర్చించుకుంటున్నారు.