జాతర శిల్పారామంలో అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : ఏప్రిల్ 29:
ఏప్రిల్ 29 మధురవాడ జాతర శిల్పారామంలో ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం అధ్యక్షులు సిరిపురపు సంతోషి, కార్యదర్శి వాండ్రాసి మంగ, సహాయ కార్యదర్శి సన్నీయమ్మ ఆధ్వర్యంలో సంస్కృతిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. 27మంది చిన్నారులు, పెద్దలు కలిసి ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం సభ్యులు మధురవాడ పరిసర ప్రాంతాలలో దైవ కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాలకు కోలాట నృత్య ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. గత మూడేళ్లలో 100కు ప్రదర్శనలు ప్రదర్శించారు. అదే విధంగా ఆదివారం జాతర శిల్పారామంలో చిన్నారులు, పెద్దలు నగరంపాలెం, పీఎంపాలెం, లక్ష్మీ వాణిపాలెం, కలానగర్, ఉప్పాడ, కే నగరంపాలెం నుండి అందరూ కలిసి నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం జాతర శిల్పారామం ఏ ఓ విశ్వనాధ్ రెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం సభ్యులను అభినందిస్తూ వారికి గుర్తింపు పత్రాలను అందచేశారు. బృందం సభ్యులు వారికి ప్రదర్శన చేసేందుకు అవకాశం ఇచ్చిన విశ్వనాధ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవ ప్రదంగా దుషాలువాతో సత్కరించి గౌరవించారు.