మురుగు నీరు పోయే కాలువలో మంచి నీరు పట్టుకుంటున్న రెడ్డి పిల్లి ఎస్ సి కొలని నివాసితులు.
భీమిలి : పెన్ షాట్ : ఏప్రిల్ 22:
చలించిపోయిన ప్రజా పరిచయ కార్యక్రమంలో భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి.నాగోతి నాగమణి గత ఐదు నెలలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధం అని మీడియా ముఖంగా వెల్లడించినప్పటినుండి అలుపెరగని బాటసారిలా, చలికి, వర్షానికి, ఎండకు లెక్కచేయ్యకుండా నిత్యం ప్రజలలో ఉంటూ తనను తాను ప్రతీ ఒక్కరిని పరిచయం చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రతీ వీధి, వాడ, గ్రామంలో కలియతిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ పార్టీ అభ్యర్థి అయిన గెలవక ముందు వంగి వంగి దండాలు పెట్టి స్థానిక నాయకులు ప్రొద్భలంతో సమస్యలు పరిష్కరిస్తామని అనంతరం గెలిచిన తరువాత నిధులు విడుదలైన మొహం చాటియ్యటం మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి అనే సరికి సమస్యలు పరిష్కారంలో నా అంతటి కష్ట పడే రాజకీయ నాయకులు లేరు అని చెప్పుకునే విధంగా వీధికో శిలా ఫలకం పెట్టి మళ్లీ ఎన్నికలలో ఓట్లు దండు కోవటం షరా మామూలవుతుందని ప్రజలు ఏవీదికి, ఏ వాడకి, ఏ గ్రామానికి వెళ్లిన తమ గోడుని వెళ్ళబోస్తున్నారని అదే క్రమంలో సోమవారం రెడ్డిపల్లి పరిచయ కార్యక్రమంలో ఎస్ సి కాలనీ వెళ్లేసరికి నివాసితులు మురుగు నీరు వెళ్లే కాలువలో మంచి నీరు పట్టుకోవటం చూసేసరికి నా కళ్ళలో నీళ్లు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇంత అత్భుతంగా అభివృద్ధి చేసాము అని అధికార, ప్రతిపక్ష నాయకులకు రెడ్డి పల్లి ఎస్ సి కాలనీ మంచి నీటి సమస్య కనబడలేదా అంటూ ఆమె ప్రశ్నించారు. స్థానిక నివాసితులకు అమ్మ నేను భీమిలి నియోజకవర్గం సమస్యలు తెలుసుకుని పార్టీ నాయకులు వలె కాకుండా స్వచ్చందంగా ప్రజలకు మేలు చేద్దామని స్వతంత్ర శాసన సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నాకు మహిళగా మీ కష్టాలు నేరుగా తెలుసుకున్న వ్యక్తిగా స్థానిక మహిళగా గుర్తించి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి. మీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాను అని ఆమె వారికి భరోసా కల్పించారు. స్థానికులు ఆమె సమస్యలు అడిగే తీరును బట్టి వారి సమస్యను పరిష్కరిస్తారని ఆమె పై నమ్మకంతో నాగోతి నాగమణికి మద్దతు తెలిపారు.