భీమిలి ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన
పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు.
భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 24:
భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామ సర్పంచ్ మొకర భవాని, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మొకర అప్పలనాయుడు, సీనియర్ నాయకులు మొకర శ్రీనులు భీమిలి నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఎం వి పి కాలనీలో గల గంటా శ్రీనివాసరావు నివాసం లో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి గంటా శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గంటా శ్రీనివాసరావు ప్రచారంలో భాగంగా కృష్ణాపురం గ్రామంలో జరిగే కార్యక్రమంలో సర్పంచ్ మొకర భవాని మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మొకర అప్పలనాయుడు సీనియర్ నాయకులు మొకర శ్రీనుల ఆధ్వర్యంలో గ్రామంలో సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు 200 కుటుంబాలతో గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కాళ్ళ నగేష్ కుమార్, మాజీ ఎంపిపి డి గోపి బాబు, కొవ్వాడ సర్పంచ్ కోన శ్రీను, మాజీ సర్పంచ్ ఎస్ అచ్చింనాయుడు, సీనియర్ నాయకులు ఎస్ పైడి నాయుడు, మాజీ ఎంపిటిసి బొడ్డు శ్రీను, మండల తెలుగు యువత ప్రెసిడెంట్ కాళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.