తునివలస, చిన్నపురం లో ప్రజా పరిచయ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి.

తునివలస, చిన్నపురం లో ప్రజా పరిచయ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి. 

 భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 23: 


పద్మనాభ మండలం తునివలస, చిన్నపురం గ్రామాలలో మంగళవారం భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. 5 నెలల ప్రయాణంలో భీమిలి నియోజకవర్గంలో గడప గడపకు ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమం లో పద్మనాభ మండలంలో పోర్నూరు, తునివలస,చిన్నాపురం లో పర్యటించిన స్వతంత్ర అభ్యర్థి నాగమణి కి ఇస్తున్న మద్దతును చూస్తుంటే ముచ్చటేస్తుంది అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి ఒక స్త్రీ గా కుటుంబానికి ఇచ్చే సేవను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం పని చెయ్యాలనే దృఢత్వం ఉన్న మహిళగా మన్నలను పొందుతున్నారు ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ్య అభ్యర్థులను ఎన్నుకొని మా నియోజిక వర్గ అభివృద్ధిని మిమే గంగలో కలిపాము అని ప్రజలు వాపోతున్నారు దీని నిమిత్తం నాగమణి మాట్లాడుతూ వలస పాలన వద్దు స్థానిక పాలనే ముద్దు పార్టీ సింబల్స్ కాదు స్వతంత్ర అభ్యర్థి ని శాసన సభకు పంపండి అభివృద్ధికి ఒక కొత్త అధ్యయనం రాసి చూపిస్తా అని ఆమె భరోసా ఇచ్చారు.