లక్ష్మి టవర్స్ లో అవంతికి అపూర్వ స్వాగతం

లక్ష్మి టవర్స్ లో అవంతికి అపూర్వ స్వాగతం 

మధురవాడ :పెన్ షాట్ : ఏప్రిల్ 21:

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్ 2 ,5వ వార్డు 

గడప గడపకు వెల్లిన ఆయనకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. లక్ష్మీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తాము అర్హులం కాకపోయినా జన రంజకమైన పాలన మమ్మల్ని ఆకట్టుకుందని మా మద్దతు జగనన్నకే అని

కొందరు మహిళలు ఉద్రేకపూరిత ఆనందాన్ని అవంతి శ్రీనివాస్ ముందు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ళ కాలంలో భీమిలి నియోజకవర్గం మొత్తం చేసిన అభివృద్ధి, 

ని వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి గెలిపించమని కోరారు.

స్థానిక సమస్యలు పరిష్కారానికి మరింత శ్రద్ధతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పౌరసత్వ గుర్తింపునిచ్చే ఓటు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని,

కష్టమని భావించకుండా, పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో నించొని ఓటు హక్కు వినియోగించుకుని సామాజిక బాధ్యత నిర్వర్తించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు,

, లక్ష్మీ టవర్ గృహ సముదాయం సంఘ సభ్యులు చంద్రశేఖర్ , శ్రీనివాస్,దుర్గారావు ,విశ్వనాధం ,

రామారావు,సత్యనారాయణ ,

జగదీష్ ,అప్పారావు, తదితరులు పాల్గొని అవంతి శ్రీనివాసులు సత్కరించారు