ఆనందపురం శ్రీరామ నవమి వేడుకల్లో గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ

ఆనందపురం శ్రీరామ నవమి వేడుకల్లో గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ

ఆనందపురం: వి న్యూస్ : ఏప్రిల్ 17:

విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో శ్రీరామ నవమి వేడుకల్లో గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ పాల్గొన్నారు. మండలంలోని రామవరం, కోలవానిపాలెం,గిడిజాల రామాలయాలలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రోచ్చారణలు, వేద మంత్రాలతో గ్రామస్థులు ఆహ్వానం పలికారు. గంటా కుమారుడు రాకతో రామవరం, కోలవానిపాలెం,గిడిజాల గ్రామాల్లో కోలాహలం నెలకొంది రవితేజతో ఫోటోలు తీయించుకునేందుకు యువత పోటీపడ్డారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. శ్రీరాముని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ అందాలన్నారు, రైతన్నలకు మేలు జరిగేలా ఆశీర్వదించాలన్నారు. రవితేజతో పాటు ఘట్టమనేని ఎస్టేట్ యజమాని సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గిడిజాల రామవరం, కోలవానిపాలెం,కణమాం సర్పంచులు కోరాడ రాము, యర్రా రాజు, శ్రీకాంత్, అప్పల రమణ లతోపాటు కోలవానిపాలెం మాజీ సర్పంచ్ గండ్రెడ్డి సోము నాయుడు,గండ్రెడ్డి రమేష్, షినగం రామకృష్ణ, వెంకటరావు,చంటి, అచ్చిబాబు, కోరాడ వైకుంఠ,శ్రీను, మూర్తి, వేమ గొట్టిపాలెం జనసేన నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు....