భారీ మెజారిటీ తో గెలవటం నా లక్ష్యం : భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్.
మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 15:
7వవార్డ్ మానంఆంజనేయులు నగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలులో భారీ మెజారిటీ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు. 18వతేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుపుతూ నామినేషన్ కు ఉమ్మడి కూటమి సభ్యులు భారీగా తరలి రావాలని నామినేషన్ రోజే మన కూటమి మెజారిటీ చూపించాలని అన్నారు. ఎవరో ఏదో అన్నారని అన్నిటిపై స్పందించి తిరిగి వారిపై కౌంటర్ లు వేసే తత్వం నాది కాదని నా స్టయిల్ నాకు ఉంది అని అన్నారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి పై రిపోర్టర్ అడిగిన ప్రశ్న పై ఆయన మాట్లాడుతూ ముందుగా నిజంగా రాయి జరిగి ఉంటే మేము కూడా ఇటువంటి ప్రోత్స హించకుండ ఖండిస్తామని అన్నారు. కానీ జగన్ ఎన్నికలు వచ్చే సరికి ఎవరొకరిని బలి పశువును చేస్తున్నారు అని అన్నారు. గత ఎన్నికలలో కోడి కత్తి డ్రామా ఆడి శ్రీను ని 5 ఏళ్ళ పాటు జైలులో ఉంచి వాడి జీవితాన్ని నాశనం చేసారన్నారు. అలాగే ఇది ఒక డ్రామాలా ఉంది అని అన్నారు. సరిగ్గా రాయి విసిరిన సమయంలో ఒక ముఖ్య మంత్రి సభలో విద్యుత్ అంతరాయం కలగటం చిన్న కంకర పిక్కతో తగిలిన గాయానికి హత్య యత్నం జరిగిందనటం హాస్య స్పదంగా ఉంది అని అన్నారు. మీరు ఎన్నికలు సమయంలో చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు ఓటుతో మీకు బుద్ది చెబుతారు అని అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కి ఏక్ష్పైరీ తేదీ దగ్గరలో ఉందని మా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణా లో ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ వలె మునుగుతున్న వోడ వలె వైసీపీ పూర్తిగా పతనం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల, 7వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ 7వ వార్డ్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.