ఐదవ వార్డ్లో వైయస్సార్ సిపికి షాక్!పలువురు సచివాలయ గృహసారథులు,సీనియర్ నాయకులు టిడిపిలో చేరిక

ఐదవ వార్డ్లో వైయస్సార్ సిపికి షాక్ 

మధురవాడ: వి న్యూస్ : ఏప్రిల్ 28:

5వవార్డులో పలువురు సచివాలయ గృహసారథులు,సీనియర్ నాయకులు టిడిపిలో చేరిక 

టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి భీమిలి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. 

జీవీఎంసీ ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కి గట్టి షాక్ తగిలింది. వార్డ్ లో గల 75,77 సచివాలయల గృహ సారథులు అలుగోజు రాజు, డి సుశీల తో పాటు శారద నగర్, పరదేశి పాలెం, సాయిరాం కాలనీ ,రాజీవ్ గృహకల్ప, తదితర ప్రాంతాల నుండి వైసిపి నాయకులు శెట్టి ప్రవీణ్, వెంకటరమణ,శ్రీను, నాగభూషణ్, అనిల్ ,రాంబాబు, ధనుంజయ, రాజేష్, సతీష్ తదితరులు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ నుండి టిడిపి లో చేరారు. వారందరికీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ కండువాలు బహుకరించి టిడిపిలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం వారందరూ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటి పడిందని, యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందని, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా తయారుచేసిందని,కావున ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి మెరుగుపడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే సాధ్యమని అందుకే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరామని అలాగే భీమిలిలో గతంలో గంటా శ్రీనివాసరావు చేసిన అభివృద్ధి తప్ప గత ఐదేళ్ల లలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని కావున భీమిలి అభివృద్ధి చెందాలంటే అది గంటా శ్రీనివాసరావు వల్లే సాధ్యమని అందుకే ఈరోజు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఈగల రవికుమార్, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు ,బోయి వెంకటరమణ, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, యువత అధ్యక్షులు కొండపు రాజు, టిడిపి మహిళ నాయకులు మిత్తాన రవణమ్మ, బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు, దుర్గారావు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.