స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి కి రెండో విడత పరిచయం కార్యక్రమంలో అశేష నీరాజనం పలుకుతున్న ప్రజలు.
ఆనందపురం : పెన్ షాట్ ప్రతినిధి : ఏప్రిల్ 27:
ఆనందపురం మండలంలో రెండో విడత ప్రజా ప్రచార పరిచయ గడప గడపకు ప్రచారం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల వద్దకే పరిపాలన అనే నినాదంతో పర్యటిస్తున్న భీమిలి శాసన సభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మండలంలో కొలువైనున్న కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల చేత ఆశీస్సులు తీసుకొని దుక్కవానిపాలెంలో తమను తాము పరిచయం చేసుకునే క్రమంలో అభ్యర్థి నాగమణికి గ్రామస్తులు ఆడపడుచులు బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చి మద్దతు తెలియజేసి ఇంతవరకు చూసినా పాలన వద్దు స్థానిక పాలన రావాలని అభినందిస్తూ నాగమణికి జై జైలు పలికారు అనంతరం నీలాకుండీలు గ్రామం శొంఠ్యం గ్రామం పర్యటించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీరు అందిస్తున్న అభిమానం నన్ను మరింత ఉత్తేజ పరిచి నన్ను ముందుకు తీసుకెళ్తుంది ఏ గ్రామం వెళ్లిన వెల్లువెత్తిన సమస్యలు తప్ప మరే ఇతర సంతోషాలు లేవని వాపోతున్నారు ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉండాలి అని చదువుకున్న వారు అందరూ ఓటు వెయ్యటానికి కూడా ముందుకు రావడం లేదు నీ హక్కును వియోగించకోకుండ ప్రజా స్వామ్యనికి నీ బాధ్యతగా నువ్వు ఏం చేస్తున్నావు రండి కదలి రండి నిను పిలుపు నిస్తున్నాను నాతో నడిచి అభివృద్ధి దిశగా ప్రయాణం చేద్దాం ముఖ్యంగా యువతను ఆహ్వానిస్తున్నాను మేలుకో యువత మీరే ఈ దేశపు భవిత, ఉన్న పార్టీ సింబల్స్ మీద కాకుండా నీ మనస్సాక్షిని ప్రసించుకొని ఈ మీ అమూల్యమైన ఓటు వెయ్యాలి అని కోరుతూ నోటుకి మద్యానికి ఆశపడి 5 ఏళ్ల బానిసత్వానికి అలవాటు పడకండి పోరాడుదాం పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప మరేదీ మనవి మాన ముందు తరం వారివి గమనించు నీ ఓటు నీ రాతలు మార్చే విధంగా ఉండాలి అది సేరైన అభ్యర్థిని ఎన్ని కోవడమే మీ లక్ష్యం అని భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పేర్కొన్నారు ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి సోమవారం మీ అభ్యర్థి సింబల్ వస్తుంది అది అందరికీ చేరవేసే విధంగా ఓ ప్రణాళికని సిద్ధం చేసి మిమ్మల్ని అందరిని మరొకసారి గడపగడపకు నన్ను నేను పరిచయం చేసుకుంటానని తెలియజేశారు.