మా పిల్లల్ని అన్యాయంగా అరెస్టు చేశారు: అరెస్టయిన మైనర్ పిల్లల తల్లిదండ్రులు అవేదన

మా పిల్లల్ని అన్యాయంగా అరెస్టు చేశారు: అరెస్టయిన మైనర్ పిల్లల తల్లిదండ్రులు అవేదన

చేపలుప్పాడ: వి న్యూస్ : ఏప్రిల్ 08:

చేపలుప్పాడలో గతనెల 29వ రాత్రి జరిగిన వ్యక్తి దహనం కేస్ లో తమ పిల్లల ప్రమేయం లేకపోయినప్పటికీ వారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమని తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆ కేసు లో నిందితులుగా వున్న పెద ఉప్పాడ, చిన ఉప్పాడలకి చెందిన మైనర్ బాలుర తల్లి దండ్రులు పుక్కెళ్ళ తాతారావు, తామర పల్లి భోగమ్మ అన్నారు. చేపలుప్పాడలో సోమవారం  జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ఇంట్లో వున్న తమ పిల్లల్ని బలవంతంగా తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారని అన్నారు. ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలను ఆ విధంగా చేయడం పట్ల తాము తీవ్ర దిగ్ర్భాంతి కి గురవుతున్నామని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు నిందితులు బైటికి వస్తారన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏ తప్పు చేయని పిల్లల్ని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.