ఏప్రిల్19న నామినేషన్ వేయనున్న భీమిలి శాసన సభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి.
భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 17:
భీమిలి నియోజకవర్గం నుంచి శాసన సభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఏప్రిల్ 19వ తేదీన 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయునునట్టు స్థానిక స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి శ్రీ రామనవమి సందర్భంగా బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తగరపువలస కూడలి మొదలుకొని భీమిలి ఆర్ డి ఓ కార్యాలయం వరకు నామినేషన్ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేయుచున్నాను అని తెలియజేస్తూ ఈ తరుణంలో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన నా ప్రజా పరిచయం కార్యక్రమంలో నాలుగున్నర నెలల ప్రయాణంలో మన భీమిలి నియోజకవర్గం ప్రజలు అందరూ నన్ను ఎంతగానో ఆదరించారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు అని తెలియజేస్తూ మరి ముఖ్యమైన ప్రకటనగా మన స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఏప్రిల్ 19న నామినేషన్ వెయ్యనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మన భీమిలి నియోజకవర్గం ప్రజలు నా నామినేషన్ రోజు నుండి మరింత ఎక్కువగా నన్ను ఆశీర్వదించి మరియు ఆదరించాలని కోరుతూ అంతే కాకుండా మే13న జరిగే పోలింగ్ న అత్యధిక మెజారిటీతో విజయం చేకూరె విధంగా నన్ను ప్రజలకు దగ్గర చెయ్యాలని స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణికి మీ అమూల్య మైన ఓటు వేసి గెలిపించ వలసిందిగా కోరారు. స్థానికులకు అవకాశం ఇవ్వండి, స్థానిక మహిళ గా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అన్నారు. యువతను ఉత్తేజ పరచండి కొత్త వాళ్ళు రాజకీయ్యలోకి రావాలి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలి అని ఆమె పేర్కొన్నారు.