ఘనంగా శ్రీ శిరిడి సాయి ధ్యాన మందిర 6వ వార్షికోత్సవ వేడుక.
మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 23 :
సామాజిక,ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలి.
ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రసాదవితరణ చేసిన మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు.
మధురవాడ: జీవీఎంసీ 5వవార్డు పరిధి కొమ్మాది జం,డ్రైవర్స్ కాలనీ (కార్పెంటర్స్ కాలనీ దరి)లో వేంచేసి ఉన్న శ్రీషిరిడి సాయి ధ్యాన మందిరం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు.. సాయినాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రాంగణంలో అతిథుల చేతుల మీదుగా భారీ అన్నసంతర్పణ నిర్వహించారు.ఈసందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... సామాజిక,ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. సుమారు3500మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీవారు అధ్యక్షులు పి.వి. రమణమూర్తి తెలిపారు. ప్రతిఏడాదిలాగే ఈసంవత్సరం అన్నప్రసాదాన్ని అందించటం జరిగిందని,ఇంతటి మహత్తర కార్యానికి హాజరైన గంటా శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులకు ఆ షిరిడిసాయి నాధుని ఆశీస్సులు నిత్యం ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు,చిక్కాల విజయబాబు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు,మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు,నాగోతి వెంకట సత్యనారాయణ, ఈగల రవికుమార్,బొడ్డేపల్లి రంగారావు,నారాయణరావు, ఆలయ ధర్మకర్త కమిటీ సభ్యులు రమణమూర్తి,ఈశ్వరమ్మ, బోని రాజు ,హేమలత, వియ్యపు నాయుడు,కొండపరాజు, బిర్లంగి నారాయణరావు కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.