వైసీపీ పాలనంతా అరాచకమే. చంద్రబాబు హయాంలోనే ఏపీ అభివృద్ధి! 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి : ఏప్రిల్ 29:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనంతా అరాచకమేనని భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి గతంలో నడిపించాలంటే గంటాకు ఓటు వేయాలని అలాగే విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే శ్రీభరత్ ఓటు వేయాలని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. కార్యక్రమంలో మతుకుమిల్లి శ్రీ భరత్ సోదరుడు గీతం యూనివర్సిటీ సెక్రెటరీ అయినా మతుకుమిల్లి భరద్వాజ్ ,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ,జనసేన వార్డ్ అధ్యక్షులు దేవర శివ లతో కలిసి సోమవారం 5వ వార్డు పరిధి శారదనగర్, మారికవలస గ్రామప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొల్లి హేమలత మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం హయంలో భీమిలి నియోజకవర్గం లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, ప్రస్తుత వైసిపి పాలనలో అభివృద్ధి అన్నమాట ఎక్కడా కనిపించడం లేదన్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదని,గత ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. టిడిపి పార్టీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ప్రజలకు పరిచయం చేసింది ఎన్టీఆర్ అని అన్నారు.ప్రజా సంక్షేమానికి కేరాఫ్ తెలుగుదేశం పార్టీ అన్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలు భీమిలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావుని,విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.ఈ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు, బోయి వెంకటరమణ, భీమిలి నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ బోయి శ్రీకాంత్ రెడ్డి,టీడీపీ ఉపాధ్యక్షులు ఈగల రవికుమార్, జనసేన ఉపాధ్యక్షులు దారపు సూరిబాబు,ఇమంది శ్రీను, ఈశ్వర్ రావు ,ధర్మారావు , సింహాచలం నాయుడు , సంతోష్ ,నారాయణ ,శర్మ , కిరణ్, ఆశోక్, రాజేశ్,నరేష్ ,వెంకట సాయి, నల్లన ఆనందరావు,అప్పన్న, యువత అధ్యక్షులు కొండపు రాజు, టిడిపి మహిళ నాయకులు మిత్తాన రవణమ్మ,బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు,దుర్గారావు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.