చంద్రబాబు పాలనతోనే రాష్ట్రానికి భవిత! 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 25:
మధురవాడ: చంద్రబాబు నాయుడు పాలనతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అని,గాడితప్పిన ఆంధ్రరాష్ట్రానికి పూర్వ వైభవం టిడిపితోనే సాధ్యమని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉ,, మధురవాడ 5వ వార్డ్ పరిధి బోయపాలెం జంక్షన్,పిపి-1 కాలనీ లలో పర్యటించారు.టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు,విశాఖ పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు,బోయి వెంకటరమణ,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, వార్డు జనసేన అధ్యక్షులు, దేవర శివలు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు.భీమిలి నియోజకవర్గ శాసనసభ్యునిగా గంటా శ్రీనివాసరావు,ఎం.పీ.గా శ్రీ భరత్ లను గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్ రెడ్డి, యడ్ల గణేష్ యాదవ్,జనసేన ఉపాధ్యక్షుడు దారపు సూరిబాబు,టిడిపి ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు, ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, సీనియర్ నాయకులు అప్పల సూరిబాబు రెడ్డి ,యువత అధ్యక్షులు కొండపు రాజు,గడ్డి శ్రీను,మహిళా నాయకురాలు సరస్వతి,సునీత,వనిత,నాగోతి అనిత,జనసేన నాయకులు సన్యాసి రావు,సాయి వెంకట్,కృష్ణ టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.