133వ అంబేద్కర్ జయంతికి నివాళులు అర్పించిన సిపిఐ, సీఐటీయూ నేతలు

133వ అంబేద్కర్ జయంతికి నివాళులు అర్పించిన సిపిఐ, సీఐటీయూ నేతలు.

మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 14:

మధురవాడ స్వతంత్ర నగర్ ఏరియా రిక్షా కాలనీ దగ్గర బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మధురవాడ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ సిఐటియు నాయకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మందనగాడు పట్టణానికి దగ్గర ఉన్న అంబా వాడేగ్రామంలో జన్మించారు. అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత అతను 16 భాషల్లో పీహెచ్డీ చేశారు అతను 64 భాషల్లో మాట్లాడగలరు మనకు స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు కల్పించడం వల్ల మనం ఎంతో స్వతంత్రంగా బతకగలుగుతున్నాము స్త్రీలు అన్నిట్లో ముందుండాలని అందరూ చదువుకోవాలని ప్రతి ఒక్కరు ముందు చదువుకే మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అంబేద్కర్ ఎప్పుడు అందరి గురించి ఆలోచించేవారు అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడి చదువుకున్నారు అతను చదువుకున్న వయస్సులో స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవరూ అతన్ని లోపలికి రానిచ్చే వారే కాదు అతను కిటికీ దగ్గర ఉండి గురువు చెప్పిన మాటలు విని నేర్చుకునేవారు ఒకరోజు గురువు చెప్పిన లెక్కలు ఎవరైనా చేయండి అని అడిగితే ఎవరూ రాలేదు అప్పుడు బయట కిటికీ దగ్గర ఉన్న అంబేద్కర్ వచ్చి గురువు చెప్పిన లెక్కలు చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ ఏ రాజేష్, ఎంసుశీల, ఆనంద్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.